Tuesday, 7 June 2016

చెలి..
నీ కళ్ళళ్ళోని పొగరు 
నీ పెదవి జారె  ప్రతి
మాటలొ తొంగి చుసె ఆ పొగరు
నీకె అందం..

నీ వాలు జడలొని పొగరు
నీ కాలి అందెలలొని పొగరు
నిన్ను  చుట్టిన అ చీర   
అంచులలోని పొగరు 
నీ అందన్ని మరింతగా 
మెరిపిస్తుంటే.. 

నీ నడుము మడతళ్ళో తోంగి  
చుసె ఆ సోగసులు  
ఆ సోగసుల్లొ తోంగి  
చుసె నీ పొగరు 
ఓ అద్బుతం అని
మురిపిస్తుంటే..    

నీ పొగరు చుసి 
ఆ నెలవంకె తలదించగ
నీన్ను చుస్తె 
చాలు ఈ క్షణం అని 
నీలిచిపోతున్నా...!!!   

Tuesday, 10 May 2016

నా పెగుని పంచుకుని
నాలోని అమ్మను పరిచయం 
చెసిన నా బంగారం      .. నా యుగెష్ 

నా జీవితం లో నన్ను తొలిసారిగా
 "అమ్మ "  అని పిలిచినా నా గారల
పంట                      ..నా యుగెష్

చందమమను చుపించి అనందించాను  
గొరు ముద్దలు తినిపించి మురిసిపొయను
తప్పటడుగులు వెస్తుంటె తన వెనకె  
పరిగెడుతు అల్లరి చెశాను ..    

నా వడిలొ వాలి నన్ను
నన్ను హత్తుకుని మురిపించిన
ముద్దల క్రిష్ణుడు             .. నా యుగెష్ 

నా ప్రతి మాటకు విలువనిచ్చె  
నా చిన్ని రాముడు        ..నా యుగెష్

ఒక్క క్షణం ప్రపంచం ముగబొయింది ..
  
నా ఇంటి దీపం ఆరిపొయింది 
నా పెదవి పై చిరునవ్వు మాసిబోయింది     
నన్ను వదిలి వెళ్ళి పొయవ్
నన్ను ఈ ఇలలొ శిలను చెశావ్  ..

నీన్ను తలచుకున్న ప్రతిక్షణం
నా కన్నిళ్ళె నీ జ్ఞాపకాలుగా   
అల్లుకుంటున్నాయి ..   

నువ్వు రావని తెలిసినా 
నా కన్నుల్లో నీన్నె నీంపుకుని 
నీ కోసమె 
ఎదురుచుస్తూ   
నీలుచున్నా..!!!

ఓ ముద్దబంతి పువ్వా
నీ పెదవి పై ఆ మౌనం ఏలా   

నీ పెదవి పై చిరునవ్వుల జల్లులు కురవాలి
ఆ సిరి నవ్వుల జల్లులె వెయి వసంతాలై
నీన్ను తాకలి.. 

నీన్ను తాకె ఆ వెన్నల
నీన్ను తాకె ఆ చిరుగాలి  
సైతం 
 నీ పెదవి పై చిరునవ్వులు 
చూసి మౌనంగా తలదించుకొవాలి.. 
నీ పెదవి పై  
చిరునవ్వులు
ముత్యలై కురావలి
అది చుసి నె మురిసిపొవలి
నీ చిరునవ్వులలొ తడిసిపొవాలి..  !!!



      

Saturday, 20 February 2016


ప్రియ ..

వెయి కనులు చాలవు 
నీన్ను భందించడానికి ..

వెయి కలువలు చాలవు
నీన్ను ప్రెమించడానికి..

వెయి పదములు కలిపిన చాలవు
నీన్ను పలకరించడానికి..

వెయి ఊహాలు చాలవు 
నీన్ను ఊహించడానికి..

వెయి కవితలు చాలవు
నీన్ను వర్ణించడానికి.. 

వెయి చిత్రములు చాలవు 
నీన్ను చిత్రించడానికి..

వెయి చందమామలు సరి తుగవు
నీ అందన్ని కోలవడానికి.. 

నా ప్రతి ఊహలొ     "నువ్వె "
నా వెయి ఊహల నిండా
"నువ్వె" నువ్వె..    !!!     





Tuesday, 5 January 2016

కలలాంటి నీజమా.. 

నా కన్నులలొ 
మెరిసిన స్వప్నమా. .

ఓ శిల్పి చెక్కిన 
ఆందమా..

నా హ్రుదయంలొ దాగిన
కావ్యమా..  

రవివర్మ కుంచ తొ 
ఫ్రాణం పొసుకున్న ఛిత్రమా.. 

సెలయటి నడుమా
 దాగిన ముత్యమా…

నన్ను అల్లుకున్న 
ఫ్రణయమా..

నాలో మెరిసిన
కవితా పుష్పమా ..

నా ప్రేమ నీవె.. 
నా ఊపిరి లో నీవె... !!!

Thursday, 15 October 2015

ప్రియ...
 కవిత
నా కలలకు రూపం
 అక్షరాలు
నా ప్రెమకు ప్రతిరూపాలు..

నీ పరిచయంతొ
నా జివితంలొ
వసంతాలు పూయించావు
నీ ప్రెమతొ
నాలొని ఆశలకు
ఊపిరి పొశావు.. 

నిన్ను కలిసిన 
తొలిసారి
మనం కలుసుకున్న
 గుడి                                                                                     

నిన్ను ముద్దాడిన  క్షణం   

ఎన్నటికి మరువలెను...

వయ్యరమంతా  ఒలకబొస్తు                                                        
నాకొసం నివు నడిచివచ్చిన 
 క్షణం

నేనే  నీ ప్రౌణమంటూ 
నీ నవ్వులతొ నన్ను మురిపించిన
ప్రతిక్షణం
నా జివితంలొ
అతి మదురమైన క్షణాలు
            
నీ నవ్వులు నావని
నీ ప్రెమ నాకు సొంతమని
మురిసిపొయను..                                                     

ఒక్క క్షణం  ప్రపంచం
ముగబొయినది...                                                                

ప్రియ !
నీ నవ్వులు నావి కావని
నీ ప్రెమ నాకు అందదని
తెలిసిన  క్షణం
కన్నిళ్ళను కౌగిలించుకున్నను..

నా కన్నిళ్ళకు భాషాలెదు
నా నవ్వులొ జివం లెదు
నా ప్రెమకు ఊపిరిలెదు
మనిషినయి వున్నాను  
కాని హ్రుదయం లెని
శిలనయినాను ...!!!

Monday, 9 March 2015

కలలే కంటున్నా
ఆ కలలో నిన్నె చుస్తున్నా
నా కనుపాపకు నీ కలలే
కనువిందులు చెస్తుంటె
నా కన్నుల్లో 
నీ ఊహలనే 
చిత్రిస్తున్నా...

నా కలలకు 
ఊపిరి నీవు

నా కన్నుల్లో మెరిసె 
మెరుపులకు చిరునామ నీవు

నా కవితల్లో తొంగి చుసె
తోలకరి చినుకుల 
పరిమళానివి నీవు...

ఎగిరి పోకె ఓ మనసా
ఎగిరి పోకె ఓ మనసా
ఎరుపెక్కిన నా చెలి చెక్కిలిని
ఎర్రగులబి నై ముద్దడాలని
ఆశతొ
కలలే కంటున్నా...!!!

Thursday, 26 February 2015

చెలి

గొడేక్కి దుకుతా
నీ కోసం..                                                                     for fun
బురదలొనైన నడుస్తా
నీ కోసం
పచ్చ గడ్డైన తింట
నీ కోసం..

నీ కోసం తాజ్మహల్ 
కట్టలెను కాని
అరటి తొక్కతో
పెకమెడ కట్టిస్తా

నీ కోసం 
అమ్రుతం తేలెను కని
గొలి సోడ ఒకటి కొట్టిస్తా

నీ కోసం 
ఎదైన చెస్తా

నీ కోసం 
ఎదైన ఇస్తా

నీ కోసం
ఎదైన తెస్తా

విట్టన్నిటి కంటె ముందు
నువ్వు అనుమతిస్తె
కాస్తా 
కునుకు తీస్తా...

Wednesday, 25 February 2015

చెలి

అందమైన కలలా కలిశవు..
నీ అనందమంతా నేను అంటు
నాకు తొడుగా నీలిచావు..

క్షణక్షణం నీ నవ్వులతొ
నా లోకాన్ని నందనవనం
చెస్తున్నావు..

ప్రతిక్షణం నీ ఓరచుపులతొ
నా ఊహలకి ఊపిరి
పొస్తున్నావు..

నీవె నా ఆశ
నీవె నా స్వాశ

బంతి పువ్వులాంటి 
నీ చిరునవ్వు పై
చెరగని ప్రేమలా
నిలవాలని...




Tuesday, 24 February 2015

సాయి
ఓ సాయి 
నీ పదములుకు ప్రణమిల్లిన చాలు కదా
సకల ధుక్కములు పొగొట్టు వాడివి నీవే కదా
శరణు సాయి శరణు సాయి..
శరణు సాయి శరణు సాయి..

సాయి 
ఓ షిరిది సాయి
నీన్ను తలచిన చాలు కదా
నీను కొలిచిన చాలు కదా
మా ఇంట నీవు కొలువుండి పోవు కదా
శరణు సాయి శరణు సాయి..
శరణు సాయి శరణు సాయి..

సాయి 
ఓ శేషా సాయి
నీ భజనలు చెసిన చాలు కదా
మమ్ము ఆపదల నుండి కాపాడు వాడివి నివే కదా
శరణు సాయి శరణు సాయి..
శరణు సాయి శరణు సాయి..

సాయి
ఓ ద్వారాక సాయి
నీ ధుని చుట్టిన చాలు కదా
మా మది నిండా సకల సంతోషములు నింపు వాడివి 
నీవే కదా
శరణు సాయి శరణు సాయి
శరణు సాయి శరణు సాయి..

సాయి
ఓ దేవ సాయి
నీ దివ్య మంగళ రూపము 
సందర్సించిన చాలు కదా
మాకు అభయ హస్తము ఇచ్చు వాడివి
నీవే కదా..
శరణు సాయి శరణు సాయి
శరణు సాయి శరణు సాయి..