Tuesday, 10 May 2016

నా పెగుని పంచుకుని
నాలోని అమ్మను పరిచయం 
చెసిన నా బంగారం      .. నా యుగెష్ 

నా జీవితం లో నన్ను తొలిసారిగా
 "అమ్మ "  అని పిలిచినా నా గారల
పంట                      ..నా యుగెష్

చందమమను చుపించి అనందించాను  
గొరు ముద్దలు తినిపించి మురిసిపొయను
తప్పటడుగులు వెస్తుంటె తన వెనకె  
పరిగెడుతు అల్లరి చెశాను ..    

నా వడిలొ వాలి నన్ను
నన్ను హత్తుకుని మురిపించిన
ముద్దల క్రిష్ణుడు             .. నా యుగెష్ 

నా ప్రతి మాటకు విలువనిచ్చె  
నా చిన్ని రాముడు        ..నా యుగెష్

ఒక్క క్షణం ప్రపంచం ముగబొయింది ..
  
నా ఇంటి దీపం ఆరిపొయింది 
నా పెదవి పై చిరునవ్వు మాసిబోయింది     
నన్ను వదిలి వెళ్ళి పొయవ్
నన్ను ఈ ఇలలొ శిలను చెశావ్  ..

నీన్ను తలచుకున్న ప్రతిక్షణం
నా కన్నిళ్ళె నీ జ్ఞాపకాలుగా   
అల్లుకుంటున్నాయి ..   

నువ్వు రావని తెలిసినా 
నా కన్నుల్లో నీన్నె నీంపుకుని 
నీ కోసమె 
ఎదురుచుస్తూ   
నీలుచున్నా..!!!

ఓ ముద్దబంతి పువ్వా
నీ పెదవి పై ఆ మౌనం ఏలా   

నీ పెదవి పై చిరునవ్వుల జల్లులు కురవాలి
ఆ సిరి నవ్వుల జల్లులె వెయి వసంతాలై
నీన్ను తాకలి.. 

నీన్ను తాకె ఆ వెన్నల
నీన్ను తాకె ఆ చిరుగాలి  
సైతం 
 నీ పెదవి పై చిరునవ్వులు 
చూసి మౌనంగా తలదించుకొవాలి.. 
నీ పెదవి పై  
చిరునవ్వులు
ముత్యలై కురావలి
అది చుసి నె మురిసిపొవలి
నీ చిరునవ్వులలొ తడిసిపొవాలి..  !!!