Sunday, 8 February 2015

చెలి..

ఈ వర్షం సాక్షిగా
చినుకునై జారి
నీ వడిలొ వాలిపోనా..

ఈ చిరుగాలి సాక్షిగా
నీ చెక్కిలి నిమిరి
నీ చిరునవ్వై పోనా..

ఈ తుమ్మెదల సాక్షిగా
నీ పెదవిని తడిమి
నీ అధరామ్రుతాన్ని అందుకోనా..

ఈ మబ్బుల సాక్షిగా 
మెరుపునై మెరిసి 
నీ కలి మువ్వనై కదలనా..

ఈ వెన్నల సాక్షిగా
వసంతానినై నీన్ను కలిసి
నీ కౌగిలిలొ ఓదిగిపోనా..

ఓ చిరునవ్వుల చినదానా
చెదర నీకుమా నా ప్రెమ !!!

No comments:

Post a Comment